23-12-2025 02:18:54 AM
నెలవంక దర్శనంతో మెస్రం వంశీయుల పూజలు
ఉట్నూర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర మహా ఘట్టానికి మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా జాతరకు సంబంధించి సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో పూజలకు శ్రీకారం చుట్టారు. మెస్రం వంశస్థులు గ్రామంలోని మురారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నెలవం కను దర్శించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, పూజారి హనుమంత రావు, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.