23-12-2025 12:35:00 AM
హాజరైన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య
భద్రాచలం, డిసెంబర్ 22, (విజయక్రాంతి) భద్రాచలం గ్రామపంచాయతీ సర్పం చ్ పాలకమండలి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు ఘనంగా పంచాయతీ కార్యాల యంలో నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోడియం వీరయ్యలు పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను అభినందించారు. తొలుత సర్పంచ్ పూనెం కృష్ణ తో ఐటిడిఏ పిఓ రాహుల్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఉప సర్పంచ్ రత్న కవిత తో పాటు మిగతా వార్డు మెంబర్లను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ నాయకులు అభిమానులు తమ నేతలకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ తన చాంబర్లో హాజరైన ముఖ్య అతిథులు తెల్లం వెంకటరావు, పోడియం వీరయ్య హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పంచాయతీ పాలకమండలి సమావేశంలో సభ్యులతో కలిసి పాల్గొన్నారు.