19-09-2025 12:00:00 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 18 (విజయ క్రాంతి): ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష గోడ ప్రతిని గురువారం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి వావిలాలపల్లిలోని విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చేయూతనివ్వడానికై, ప్రతిభకు పట్టం కట్టడానికై అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 25 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో రెండు సంవత్సరాల పాటు ఇవ్వబడే ఐఐటి /నీట్ శిక్షణలో రాయితీలను పొందడానికి స్కాలర్షిప్ టెస్టులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
పదోతరగతి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుమారు 54,44,444/- రూపాయల విలువగల స్కాలర్షిప్ ను ప్రతిభ చాటిన విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తెలంగాణలోని పలు అల్ఫోర్స్ విద్యా సంస్థలను సందర్శించి పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9133537444, 9160294441 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.