calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పని అయిపోయింది

19-09-2025 12:00:00 AM

త్వరలో కాంగ్రెస్ ముగుస్తుంది: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పని సైతం ముగుస్తుందని, అలాంటి పార్టీల నాయకుల గురించి మాట్లాడడం సమయం వృధా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. సాత్నాల మండలంలోని జామిని, జంగుగూడ గ్రామాల్లో గురు వారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భం గా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరాగా, వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు అనేవారు ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోవద్దన్నారు.

అలాంటి పరిస్థితులు తనకు వస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, సుభాష్, రమేష్ రోహిదాస్, రాము, మీరాబాయి, రేణుకా బాయి, ఆనంద్ రావు, అశో క్ రెడ్డి, ముకుందరావు పాల్గొన్నారు.