19-09-2025 12:00:00 AM
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్
బోథ్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేం దుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండల బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి గురువారం ఎమ్మె ల్యే ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు రోగులను పలకరించి ఆస్పత్రి లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా డాక్టరలతో మాట్లాడి రోగుల ఆరోగ్య క్షేమలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల వివరాలను డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరికరాల కొరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపా రు. ఇటీవల హైదరాబాద్‌లో కమిషనర్‌ని కలిసి ఈసీజీ మిషనరీ మంజూరు చేయాలని కోరడం జరిగిందని, రూ.4 కోట్లతో మరో భవన నిర్మాణానికి నిధులు మంజూ రు అయ్యాయనన్నారు.
ఎమ్మెల్యే వెంట మా జీ జడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ వైస్ ఎంపీ పీ స్వామి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మండల కన్వీనర్ నారా యణ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు ప్రశాం త్, చంద్రమోహన్, రఫీ, ఇఫ్తేకార్ ఉన్నారు.