14-10-2025 12:23:36 AM
కొత్తపల్లి, అక్టోబర్13 (విజయక్రాంతి): అల్ఫోర్స్ కు అత్యుత్తమ సి బి ఎస్ సి పాఠశాల అవార్డ్ లభించింది. తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు చేస్తున్న కృషి చాలా విశిష్టమైనదని, స్ఫూర్తిదాయకమైనదని అవార్డు దక్కడం పై అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలకు అత్యుత్తమ సీబీఎస్ పాఠశాల అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
విద్యాసంస్థల్లో అవలంబిస్తున్నటువంటి విద్యా విధానాలను అంతర్జాతీయ జాతీయస్థాయిలో ప్రశంసింపబడి విద్యారంగానికి తలమానికంగా నిలుస్తున్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వారు చెప్పారు.అవార్డు రావడం పట్ల తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నేతలు, యువజన, క్రీడా సంఘం ప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నరేందర్ రెడ్డి కృషి చాలా స్ఫూర్తిదాయకమని అన్నారు