14-10-2025 12:22:30 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ) : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం,
డిప్యూటీ కలెక్టర్ రంజిత్ తో కలిసి ప్రజల నుండి 34 అర్జీలు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు పాల్గొన్నారు.