calender_icon.png 22 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు

22-08-2025 12:00:00 AM

నిర్మల్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. గురువారం ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఆయన పట్టణంలోని బుధవారపేట్ నం.01 గణేష్ మండపం నుండి ఓల్ బస్టాండ్, బాగులవాడ చౌక్ (ఎంఎల్‌ఏ క్యాంపు ఆఫీస్), గుల్జార్ మార్కె ట్, గాంధీ చౌక్ మార్గంగా బంగల్పేట్ చెరు వు నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో శానిటేషన్, లైటింగ్, త్రాగునీటి సౌకర్యాలు, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు.

ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉంటాయని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఉత్స వాలను నిర్వహించి, సహకరించాలని అదన పు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.