calender_icon.png 22 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్‌నగర్‌లో నకిలీ నోట్ల చలామణి?

22-08-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, ఆగస్టు 21(విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌లో నకిలీ కరెన్సీ చలామణి అవుతుంది. పలువురు దళారులు వ్యూహాత్మకంగా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటివల ఓ ప్రముఖ వ్యాపారి స్థానిక ఓ బ్యాంకులో నగదు జమ చేసేందుకు డబ్బులను బ్యాంకుకు తీసుకెళ్లారు. రూ.500 నోట్ల కట్టలలో ఒకటి నకిలీ వచ్చింది. బ్యాంక్ అధికారులు  అ నకిలీ నోట్లో గుర్తించి సదు రు వ్యాపారికి అందజేశారు.

పది రోజుల క్రితం మరో వ్యాపారి సైతం బ్యాంకులో డబ్బు జామ చేసేందుకు వెళ్లగా రూ.500 నోట్ల కట్టల్లో మూడు వచ్చినట్లు తెలిసింది. దీన్ని బట్టి పరిశీలిస్తే పట్టణంలో రూ.500 నోట్లు నకిలివి చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. సత్వరమే అధికారులు, పోలీసులు నకిలీ నోట్లపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.