calender_icon.png 11 January, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో గానుగబండ గ్రామ కార్యదర్శి

10-01-2026 01:51:07 AM

  1. ఇంటి నిర్మాణం కోసం 6 వేలు డిమాండ్ చేసిన బర్పటి కృష్ణ
  2. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
  3. లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో గ్రామ కార్యదర్శి                          
  4. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఘటన

తుంగతుర్తి, జనవరి 9 (విజయక్రాంతి): ఇంటి నిర్మా ణం కోసం అనుమతి ఇచ్చేందుకు లంచం అడిగిన ఒక పంచాయతీ కార్యదర్శిని బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండలో శుక్రవారం జరిగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు మేరకు గానుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణ రూ. 6 వేలు లంచం అడిగాడు.

దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారుల కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం గ్రా మపంచాయతీ కార్యాలయంలో ౬వేల రూపా యలను పంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణకు సదరు వ్యక్తి ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.

ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరుపుతున్నారు.పట్టుబడిన కృష్ణను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.  ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్1064ను సంప్ర దించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో పలువురు ఏసీబీ ఆదికారులు పాల్గొన్నారు.