08-06-2025 11:08:25 PM
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఏకం కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy) స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా భారీ శోభా యాత్రను రామగిరిలోని రామాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తూ హిందువులను అణిచివేస్తుందని విమర్శించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే వారిని ఆదరించాలని స్పష్టం చేశారు. ధర్మానికి అడ్డంగా ఉన్న వారిని ఎదిరించాలన్నారు.
సమాజంలో కుల పిచ్చి నశించాలన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై చిత్రహింసలు పెట్టడం దారుణం అన్నారు. హిందువులను మనల్ని మనమే సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సెక్యులర్ విధానంతో దేశం శక్తి హీనమవుతుందన్నారు. రాష్ట్రంలో దొంగ సెక్యూరిలిజం నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు కర్నాటి విజయ్ కుమార్, హిందూ జేఏసీ నాయకులు ఓరుగంటి వంశీ, కే రవీందర్ రెడ్డి, ఎస్ రాంబాబు, నరేందర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ లోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.