calender_icon.png 30 January, 2026 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

29-01-2026 12:00:00 AM

కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట నుం చి పెద్ద ఎత్తున మహిళలు బుధవారం గుం జారి శేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలను రాజకీయాల్లో కేవలం అలంకారంగా మాత్రమే ఉపయోగించారని, నిజమైన నిర్ణయాధికారంలో వారికి స్థానం కల్పించలేదని విమర్శించారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళలకు కేవలం హామీలు కాదు, పాలనలో భాగస్వామ్యం, నాయకత్వ అవకాశాలు, నిర్ణయా ధికారం ఇవ్వాలనే స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణలో మార్పు కోసం మహిళలు సిద్ధంగా ఉన్నారనే సంకేతమని, రాబోయే రోజుల్లో మహిళల శక్తే టీఆర్పీ పోరాటానికి ప్రధాన బలంగా నిలుస్తుందని మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లో చేరిన వారిలో స్వప్న, పద్మ, మంగమ్మ, మౌనిక, పుణ్యమ్మ, నరసమ్మ, లలిత, సుజా త, అంజమ్మ, స్రవంతి, భార్గవి, శ్యామల, భాగ్యమ్మ, శారద, అనురాధ, బాలమణి, శివకుమార్, అడివయ్యా, రాజు ఉన్నారు.

అలా గే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం టీఆర్పి నాయకులు బీసం ఆంజ నేయులు అధ్వర్యంలో వివిధ పార్టీలకు చెం దిన నాయకులు అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్‌గౌడ్ సమక్షంలో టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థుల గెలు పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో వంగూరి జయశంకర్, యన్ జగన్ మోహన్, పాశం హుస్సేన్, ఎం వెంకటయ్య, అన్నపూరి క్రిష్ణ, వి శివ, డి రాజు, డి నరేష్, సి వినయ్ ఉన్నారు.