19-08-2025 01:38:27 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, ఆగస్టు (విజయక్రాంతి): జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. సోమవారం హైదరాబాదు నుండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాలో ఎరువుల కొడత వ్యవసాయ పంటల సాగు వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాల వారీగా ప్రతిరో జూ యూరియా పంపిణీపై రిపోర్ట్ అందజేయాలని, ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా విజిలెన్స్ మానిటరింగ్ కఠినంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. యూరియా కొరత రాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో యూరియా కొరతలేదని, రైతులకు అవసరమైన ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
డైవర్షన్ జరగకుండా బార్డర్ చెక్ పోస్టుల వద్ద పోలీస్, నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. రైతులకు ఎరువులు సులభంగా అందేలా షాపులను ఉదయం నుంచే తెరిచి ఉంచుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, సిపిఒ జీవరత్నం, అధికారులు పాల్గొన్నారు.