calender_icon.png 19 August, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర అభ్యాసం అవసరం

19-08-2025 01:37:22 AM

విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ రత్తయ్య

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): విద్యార్థులందరికీ నిరంతర అభ్యాసం అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరగలరని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులకు  ధన్యవాదాలు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. 

విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పంచసూత్రాల (1.ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, 2.ప్లానింగ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్, 3.కౌన్సిలింగ్ సిస్టమ్, 4.సీఆర్‌టీ తరగతులు, 5. బోధన పద్ధతి) వల్లే తమ దగ్గర చదివిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులలో 75 శాతం మంది పిల్లలకు మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.

తమ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సిస్టం ద్వారా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడిని కౌన్సిలర్‌గా నియమిస్తామని చెప్పారు. విద్యార్థుల జీవితాల్లో సంతోషం, బాధ, కష్టాలు, నష్టాలు, ఒడిదొడుకులు.. ఇలా అన్నీ ఉండాలని అప్పుడే వారు ఉన్నతంగా ఎదుగుతారని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వుజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేధించడంలో పట్టుదలే పెద్ద పెట్టుబడి అని, పట్టుదలతోనే లక్ష్య సాధన సాకారమవుతుందన్నారు.