calender_icon.png 31 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంప్లాయిమెంట్ డైరెక్టర్‌కు టీజీవో డైరీ అందజేత

31-01-2026 12:00:00 AM

27 మందికి పదోన్నతులు కల్పించడంపై కృతజ్ఞతలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ 2026 నూతన డైరీని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీమతి క్రాంతి వెస్లీ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, కార్యదర్శి ఎం.ఎ. ఖాదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్లో 27 మందికి ట్రైనింగ్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కల్పించినందుకు డైరెక్టర్ గారికి హైదరాబాద్ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.