calender_icon.png 19 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్మిద్దలో రోడ్లన్నీ బురదమయం

19-08-2025 01:04:17 AM

* రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు 

యాచారం ఆగస్టు 18 :యాచారం మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల కురుస్తున్న భారీ భారీ వర్షాలకు రోడ్లన్నీ బుడదమయంగా మారాయి. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో పరిస్థితి మరి దయనీయంగా మారింది. గ్రామం నుంచి మండల కేంద్రాలకు వెళ్లే ప్రధాన రహదారులు అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు చెరి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై గతంలోని పలుసార్లు అధికారులకు దృష్టి కి తీసుకువెళ్లి స్పందించిన దాఖలాలు లేవని  వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు  స్పందించి కుర్మిద్ద గ్రామంలోరోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.