13-05-2025 12:08:58 AM
పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల
ఆరోపణలపై సోములుగూడెం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ తొలగింపు
భద్రాద్రి కొత్తగూడెం మే 12 (విజయ క్రాంతి): వరి ధాన్యం కొలుగోలులో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ముందస్తు చర్యగా సోములుగూడెం ధా న్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జిని తొలగింపు చర్యలు చేపట్టామని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు.సొసైటీ కార్యాలయంలో సోమవారం పాలకవర్గం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ సొసైటీ ద్వారా ఐదు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యం మిల్లర్లకు పంపుతున్నామన్నారు. రైతులు విధిగా ప్యాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి తాలు లేకుండా,తేమ 17 శాతం ఎండబెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. నిబంధనల ప్రకారం వచ్చిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు.
కొనుగోలు విషయమై రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదన్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే వారిపై చర్యలు తీసుకునేలా సొసైటీ పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించాలన్నారు. దాన్యం కొనుగోలు పై వచ్చిన ఆరోపణలకు సొసైటీ ఎలాంటి సంబంధం లేదన్నారు . ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు కనగల నారాయణరావు, చౌగాని పాపారావు, భూక్య కిషన్, సీఈవో జి లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.