13-05-2025 12:07:52 AM
బిజినేపల్లి మే 12: శిథిలావస్థకు చేరిన యాదవుల ఆరాధ్యదైవం చౌడేశ్వరి దేవి ఆలయ పునః నిర్మాణానికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూ జలు చేశారు. యాదవుల ఇష్ట దైవం చౌడేశ్వరి దేవి ఆలయం పునః నిర్మాణానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. అలయ నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంబించారు.
అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏరంగంలోనైన విజ యం సాధిస్తామన్నారు. ఎంతో ప్రాశస్తి కల్గి న అమ్మవారి ఆలయ పునఃనిర్మాణంలో తనను భాగస్వామ్యుడిని చేసిన మండల యాదవ సంఘం కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సహాయ సహాకారాలైన అందించేందుకు సిద్ధంగా ఉన్నానని యాదవులకు ఆయన భరోసా కల్పించారు. ఆయ న వెంట కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం నాయకులు ఉన్నారు.