calender_icon.png 22 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు రూ.200 కోట్ల కేటాయింపు

26-07-2024 12:30:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు దాకా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈవీడీఎంకు బదులుగా హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఈ విభాగానికి ప్రారంభ దశలోనే రూ.200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్‌తో హైడ్రాకు కావాల్సిన మౌలిక వసతులు, కల్పనలు, సదుపా యాలను సమకూర్చోనుంది. హైడ్రాకు ఐజీ ర్యాంకు అధికారిని కమిషనర్‌గా నియామించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేస్తున్న విపత్తుల నిర్వహణను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.