calender_icon.png 22 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు

26-07-2024 12:34:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి):  ఐదు జాతీయ రహదారులను కలుపుతూ నిర్మాణం చేసిన ఓఆర్‌ఆర్ నిర్వహణ, ఇతర మెరుగైన సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరానికి ప్రభుత్వ బడ్జెట్‌లో భారీగా రూ.11 వేల కోట్ల నిధులను కేటాయించగా.. ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హైదరాబాద్ నగర సరి హద్దును ఓఆర్‌ఆర్‌గా భావిస్తున్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.