calender_icon.png 22 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎంటీఎస్‌కు రూ.50 కోట్లు

26-07-2024 12:27:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): విశ్వనగరంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్(మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం)కు రూ.50 కోట్లు కేటాయించింది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంఎంటీఎస్‌ను మరింత అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.