calender_icon.png 30 May, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యూటీ చేయలేని కార్మికులను మెడికల్ అండ్ ఫిట్ కు అనుమతించండి

28-05-2025 07:54:49 PM

ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్..

కొత్తగూడెం (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ విధులు నిర్వహించలేని కార్మికులకు వారి సర్వీస్ దృష్ట్యా మెడికల్ అండ్ ఫిట్ కు అవకాశం కల్పించాలని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్(INTUC Vice President Razak) కోరారు. ఈ మేరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజ్ ను కలిసి కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ నెల 14న కేజీఎం ఏరియాలో గైర్హాజరు కార్మికులకు, రుద్రంపూర్ ఆర్ సి ఓ క్లబ్ లో కౌన్సిలింగ్ నిర్వహించారనీ, ఆ కౌన్సిలింగ్ లో వారు వివిధ వ్యాధులతో బాధపడుతు, పలురకాల ఆపరేషన్లు జరిగి డ్యూటీలు చేయలేని పరిస్థితి ఉందని మెడికల్ రిపోర్ట్ లను అధికారులకు చూపించడం జరిగిందన్నారు.

ఆ కౌన్సిలింగ్ హాజరైన డాక్టర్ ఆ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి తీవ్రమైన వ్యాధులు, ఆపరేషన్ల కారణంగా ఉద్యోగులు డ్యూటీలు చేయలేకపోతున్నారన్నారు. ఉద్యోగ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి సర్వీస్ తో నిమిత్తం లేకుండా మెయిన్ హాస్పిటల్ కు పంపించి మెడికల్ అన్ఫిట్ చేసేవిదంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో జీఎం స్పందిస్తూ సరైన మెడికల్ రిపోర్ట్స్ వున్నవారికి న్యాయం జరిగే విదంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలక రాజయ్య, పోశం శ్రీనివాస్, కల్వల శ్రీనివాస్, సీతారాం, సాగర్, మల్లికార్జున్, ఖాజాపాష, క్రాంతి, మూర్తి, గుత్తుల రవి, వెంకట్రామ్, ప్రశాంత్ రాము, తదితరులు పాల్గొన్నారు.