18-09-2025 12:23:03 AM
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుక్కడపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సేవా పక్వాడ్ మండల ఇన్చార్జి పోకల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందన్నారు.
అద్భుతమైన పరిపాలన అందిస్తూ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భారతదేశము యొక్క జీడిపిని పెంచడమే కాకుండా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా దేశం ఎదగడానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు.మన రక్షణ వ్యవస్థ ప్రపంచ దేశాలలో బలమైన శక్తిగా మారిందన్నారు.దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టి అమెరికా,బంగ్లా,చైనా,దేశాలకు దీటైన జవాబు ఇచ్చింది అన్నారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఓ.బి.సి మోర్చా నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్,తాళ్ల నరేష్,సైదులు,రాజు,శివ తదితరులు పాల్గొన్నారు