calender_icon.png 9 May, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో తాగునీటికి కష్టాలు తీర్చండి

08-05-2025 12:16:11 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు ఇవ్వొద్దు 

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ మే 7 (విజయక్రాంతి): ఎండలు రోజురో జుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా సంబంధిత అధికారు లు చురుగ్గా పనిచేయాలని నాగ ర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ప్రదాత సంతోష్ అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటువద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇసుక పంపిణీతో పాటు తక్కువ ధరకు సిమెంటు, తక్కువ ధరకే మేస్త్రి కూలి కూడా అందేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

నిత్యం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం చారగొండ మండల కేంద్రం జూపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.