19-08-2025 01:06:57 AM
శామీర్ పేట్ ,ఆగస్టు 18 ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన వరి పంట మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో లక్ష్మాపూర్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులు కుంటలు వాగులు నిండి పొంగిపొర్లడంతో పెద్ద ఎత్తున వరి పంట నీట మునిగాయి. ఒక ఇంటి సెల్లార్ లోకి నీరు చేరుకొని చెరువును తలపిస్తుంది. లక్ష్మాపూర్ పెద్ద చెరువు నిండి అలుగు పారడంతో మూడు చింతలపల్లి ఉద్దేమర్రి మధ్య ఉన్న బ్రిడ్జి పై నుండి నీరు పురవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన పంట రైతులు వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.