24-12-2025 12:45:50 AM
రేగొండ, డిసెంబర్ 23 (విజయక్రాంతి): వి ద్యుత్ షాక్ తో వృద్ధ రైతు మృతి చెందిన ఘ టన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్ జి తండాలో జరిగింది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ జి తండా కు చెందిన అజ్మీర రుప్లా నాయక్ (75) తన మొక్కజొన్న చేనుకోసం నీరు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్త్స్ర కె.రాజేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.