11-08-2024 12:05:00 AM
ఆదర్శాలు అందరూ నొక్కి వక్కాణిస్తారు. కానీ, కొందరు మాత్ర మే వాటిని కడదాకా ఆచరించి భావి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సం బంధిత సమస్యలతో బాధ పడుతూ ఇటీవల కోల్‌కతాలో మరణించిన సీసీఎం సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చివరి క్షణం వరకు తాను నమ్మిన సిద్ధాంతాలు, విశ్వాసాలకు అనుగుణంగా ముందుకు సాగారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమచరిత్రలో అయన సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించారు. బుద్ధదేవ్ 1944 మార్చి 1న ఉత్తర కలకత్తాలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బీఏ డిగ్రీ (అనర్స్) అభ్యసించిన మీదట ఉపాధ్యాయు డుగా విధులు నిర్వహించారు. భట్టాచార్య 1968 లో పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రమోద్‌దాస్ గుప్తా సహకారంతో రాజకీయ రంగంలోకి ప్రవేశిం చిన ఆయన 1971లో సీపీఎం బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1985 లో నిర్వహించిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడుగాను ఎన్నిక య్యారు. 1996లో పశ్చిమ బెంగాల్ హోమ్‌మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999 జనవరి నుండి 2000 నవం బర్ వరకు ఆయన రాష్ట్ర ఉపముఖ్యమం త్రిగా పనిచేశారు.
మార్క్సిస్ట్ పార్టీ కురువృద్ధుడు జ్యోతిబసు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక 2000 నవంబర్ 6న బుద్ధదేవ్ తొలిసారిగా ముఖ్య మంత్రి పీఠం అధిష్టించారు. అప్పటి నుండి 2011 వరకు వరుసగా 11 ఏళ్ళపాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా కొన సాగారు. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంను, అంతిమంగా లెఫ్ట్ ఫ్రంట్‌ని విజయపథంలోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. అయి తే, బుద్ధదేవ్ భట్టాచార్య అనుసరించిన భూసేకరణ, పారిశ్రామికీకరణ విధా నాలపై వ్యతిరేకత కారణంగా 2011 నాటి ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 184 సీట్లు గెలుపొంది బెంగాల్‌లో 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికింది.
నాటినుండి నేటి వరకు బెంగాల్ లో కమ్యూనిస్టులు కోలుకోలేని ఎదురుదెబ్బలు ఎదు ర్కొంటూనే ఉన్నా రు. బుద్ధదేవ్ సాహిత్యంపై ప్రత్యేక అభిరుచితో అనేక రచనలు చేశారు. కొలం బియన్ రచయిత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్, రష్యన్ కవి వ్లాదిమిర్ మాయకోవ్స్కీ రచనల అనువా దాలుసహా ఎనిమిది పుస్తకాలు వెలువరించారు. బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా పనిచేసినా అతి సాధారణ జీవితాన్ని గడిపారు.
దక్షిణ కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో రెండుగదుల ప్రభుత్వ ఫ్లాట్‌లో ఆయన జీవించారు. 2022లో బుద్ధదేవ్‌కు కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్’ పుర స్కారాన్ని ప్రకటించినా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. బుద్ధదేవ్ మర ణం భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు. ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి.
జె.జె.సి.పి. బాబూరావు