11-08-2024 12:05:00 AM
భారతదేశ గ్రంథాలయ పితామ హుడు ఎస్.ఆర్.రంగనాథన్ జన్మదినాన్ని ‘జాతీయ గ్రం థాలయ దినోత్సవం’ (నేషనల్ లైబ్రేరియన్స్ డే)గా జరు పుకుంటారు. 1892 ఆగ ష్టు 12న తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జ న్మించిన రంగ నాథన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో బీఏ, ఎంఏ చేసి, 1924లో మద్రాసు యూనివర్సిటీలో క్వాలిఫైడ్ లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడే ఇరవై సంవత్సరాలు పని చేసి, తదుపరి 1945 బెనారస్ విశ్వవిద్యాలయం లో, 1947 మధ్య కాలంలో ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసారు. ఈ యూనివర్సిటీలో గ్రంథాలయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ప్రారంభించారు. 1930లో నమూనా గ్రం థాలయ చట్టం తయారుచేశారు.
1924లో క్లాసిఫికేషన్, ముఖ్యంగా 1933లో కోలన్ క్లాసిఫి కేషన్ అనే కొత్త కోడ్ తయారుచేశారు. ఇది నేటికీ గ్రంథాలయ సిబ్బందికి మార్గదర్శిగా నిలిచింది. ఈ కోడ్‌లో పుస్తక వ్యక్తిత్వం, విష యం, శక్తి, నిడివి, సమయం అనే అంశాలు ఉంటాయి. ఆయన 60 గ్రంథాలు, 200కు పైగా కథలు రాశారు. 1935లో ‘రావు సాహెబ్’ బిరుదు పొందారు. స్వాతంత్య్రానంతరం జాతీయ గ్రంథాలయ అధ్యక్షుడుగా, యూ జీసీ లైబ్రరీ కమిటీ అధ్యక్షుడుగా పనిచేశారు. దేశంలో గ్రంథాలయ శాఖకు, శాస్త్రానికి రూపురేఖలు దిద్దిన మహోన్నతుడు రంగనాథన్. దేశంలో అకడమిక్ లైబ్రరీలతోపాటు పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేసి పలువురు మన్ననలను పొందారు.
వీరి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డు బహుకరించింది. రచనలు ఒక నిర్దేశిత ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రాథమిక భావనతో ఏర్పాటైనవే గ్రంథాలయాలు. అందరికీ విజ్ఞానం అందించే భాండాగారాలు. క్రీ.పూ. 2,600 క్రితమే గ్రం థాలయాలు ఉన్నాయని ఇరాక్ ప్రాంతంలో లభించిన ఆధారాలవల్ల తెలుస్తున్నదని పురాతన పరిశోధకులు చెబుతున్నారు. కాగితం, లిపి కనుగొన్న తరువాత వివిధ దేశాల పాలకులు అనువాదకుల ద్వారా ఇతర దేశాల సా హిత్యం, కళలు, నిర్మాణాలు, మత సంబంధ అంశాలు ఆకళింపు చేసుకుని ప్రభావితమయ్యారు.
5వ శతాబ్దంలో కానిస్టెంట్ నోపుల్ లోని ఇంపీరియల్ లైబ్రరీ 1,20,000 పుస్తకాలతో ఐరోపాలోనే అతిపెద్ద గ్రంథాలయంగా ప్రసిద్ధి చెందింది. తదుపరి చైనాలో మింగ్ వంశస్థుడైన ఫాన్ క్విట్ ద్వారా 1561లో స్థాపి తమైన ‘తియాన్‌యిజే’ లైబ్రరీ అతి పురాతనమైందిగా గుర్తింపు పొంది, నేటికీ జాతీయ వారసత్వ సంపదగా కొనసాగుతున్నది. ఇక ప్రస్తుతం ప్రపంచంలో రెండు అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటి అమెరికా వాషింగ్టన్ డి.సి. లోని 15 కోట్ల ఐటమ్స్‌తో వివిధ రకాల డీవీడీలు కలిగి ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, మరొ కటి లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీ ఖ్యాతి పొం దాయి. ఇక మన దేశంలో అతిపెద్ద గ్రంథాలయంగా కోల్‌కతాలోని ‘నేషనల్ లైబ్రరీ’ దేశ ముద్రణా వారసత్వ సంపదను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇది 30 ఎకరాల్లో విస్తరించి, 22 లక్షల పుస్తకాలను కలిగి ఉంది.
1914లో విజయవాడ కేంద్రంగా ‘ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్’ స్థాపితంతో గ్రం థాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అయ్యంకి వెంకటరమణయ్య కృషి మరువలేనిది. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో గ్రంథాలయాలు నెలకొల్పారు. దేశ స్వాతం త్య్ర సాధనలో, జాతీయ, అంతర్జాతీయ అంశా లు అందించడంలో గ్రంథాలయాల పాత్ర మరువలేనిది. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు ఉన్నత శిఖరాలను అధిరోహించ డాని కి బంగారు బాటలు వేస్తాయి. అయితే, నేషనల్ బుక్ ట్రస్ట్ సర్వే ప్రకారం నూటికి ఇరవై 25 శాతం యువకులు మాత్రమే గ్రంథాలయ పఠనం చేస్తున్నారు.
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని వీరేశలింగం చెప్పిన మాటలు సదా అనుసరణీయం. విద్యార్థులు, యువత అనవసరమైన అంశాలతో, మొబైల్ ఫోన్లతో సమయం వృ థా చేయడం ద్వారా భవిష్యత్తు నాశనమవుతుంది. అనేకమంది చెడు వ్యసనాలకు బాని సలై కనీస అవగాహన, విద్యా సామర్థ్యాలు లేకుండా అన్ స్కిల్డ్‌గా తయారవుతున్నారు. ‘పుస్తకాన్ని పట్టి --విజ్ఞానం పెంచి, ఉద్యోగం పట్టు’ అనే భావనతో కదలాలి. భవిష్యత్ తీర్చిదిద్దుకోవాలి. దేశ స్థాయిలో ప్రధాన మంత్రి మోదీ డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ సమయంలో ఇంటి నుండే విజ్ఞాన సముపార్జన చేసే విధంగా అవకాశాలు కల్పించారు. ప్రభుత్వాలు ఆయా గ్రం థాలయాలలోని కొరతలను తీర్చాలి.-- లైబ్రేరియన్‌ల పోస్టులను భర్తీ చేయాలి. చాలినన్ని నిధులు మంజూరు చేయాలి. స్టేట్ లైబ్రరీ, గౌతమీ గ్రంథాలయం, కారా మాస్టా రు కథానిలయం వంటి లైబ్రరీలను పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు విజ్ఞాన సౌరభాలను అందించాలి.
ఐ.ప్రసాదరావు