01-07-2025 02:34:02 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 30 (విజయక్రాంతి) : పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ కొరకు కార్యాలయాలలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా , మండల స్థాయి కార్యాలయలాలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న లోకా యుక్త, మానవ హక్కుల కమిషన్, ఎస్ సి, ఎస్ టి కమిషన్, స్థానిక కోర్ట్ కేసు లకి సంబందించి కౌంటర్ ఫైల్, కేసు క్లోజ్, కోర్ట్ ఆర్డర్ అమలు లాంటివి తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యల పై 62, ఎంపిడిఓ లకి 26, మున్సిపల్ కమిషనర్లకి 5, డి పి ఓ 4, డి ఐ ఓ 4 ఇతర శాఖలకు సంబందించినవి 22 మొత్తం 123 మొత్తం ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబందిత అధికారులకి పంపించటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, డి పి ఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డి ఈ ఓ అశోక్, సి పి ఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.