calender_icon.png 11 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆహ్వానం.. మద్యపానానికి మంగళం

10-01-2026 12:00:00 AM

  1. ఆర్.వెంకటాపూర్లో చారిత్రాత్మక తీర్మానం
  2. గ్రామసభలో కఠిన నిర్ణయాలు
  3. మద్యపానం చేస్తే రూ.లక్ష జరిమానా

రామాయంపేట, జనవరి 9 : రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ గ్రామాభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఈ గ్రామసభలో మద్యపాన నిషేధా న్ని గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు కలిసి మద్యపానాన్ని నిషేధించడానికి చర్యలు చేపడుతున్నారు. ఏకగ్రీవంగా ఆమోదిస్తూ చారి త్రాత్మక తీర్మానం చేశారు. గ్రామంలో సా మాజిక శాంతి, ప్రజారోగ్యం, యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామసభ స్పష్టం చేసింది.

గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం అమ్మినట్లయితే రూ. లక్ష జరిమానా విధించనున్నా రు. అక్రమ మద్యం విక్రయాన్ని చూసి పట్టించిన వారికి రూ.10,000 పారితోషకం అం దజేస్తామని గ్రామసభ తీర్మానించింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలపై కూడా కఠిన నిషేధం విధించారు. దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు సహా ప్రజా ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, మద్యం సేవించి డాన్సులు చేయడం, శబ్ద కాలుష్యానికి దారితీసే కార్యక్రమాలు పూర్తిగా నిషేధం అని గ్రామసభ స్పష్టంగా పేర్కొంది.

ఎవరికీ ఏ విధమైన హాని కలగకుండా గ్రామంలో క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణ యం తీసుకున్నారు. ఇక గ్రామాన్ని కొంతకాలంగా వేధిస్తున్న కోతుల బెడదను నివారిం చేందుకు చర్యలు తీసుకుంటామని కూడా గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సంబంధిత శాఖల సహకారంతో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ గ్రామసభలో తీసుకున్న అన్ని తీర్మానాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కా ర్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు సహా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్మానాలకు సంపూర్ణ మద్దతు తెలిపారు.