calender_icon.png 24 December, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండోరా చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం

24-12-2025 12:00:00 AM

శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “దండోరా’ టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ పాటను రాసిన కాసర్ల శ్యామ్‌కు నేషనల్ అవార్డు దక్కాలని కోరుకుంటున్నా. టీజర్, ట్రైలర్ చూస్తే ‘దండోరా’ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుం దని అనిపిం చింది. కొన్ని నెలల నుంచి చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. డిసెంబర్ 25న కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ‘దండోరా’కి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్‌” అన్నారు.

శివాజీ మాట్లాడు తూ.. “నిర్మాత బెనర్జీ ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తి. ‘దండోరా’ తర్వాత ఆయన్ను చూసే తీరు మారుతుంది. నా సినిమా అయినా సరే బాగా లేకపోతే, నచ్చకపోతే నేనే విమర్శిస్తా. ‘దండోరా’ సినిమాలోని కంటెంట్‌లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఈ వారం రాబోతోన్న చిన్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కానీ డిసెంబర్ 25 సాయంత్రానికి ఇది పెద్ద సినిమా అవుతుంది. ప్రపంచ మంతా మా ‘దండోరా’ సౌండ్ వినిపిస్తుంది” అన్నారు.

“కంటెంట్‌తోపాటు కమర్షియల్‌గా మా ‘దండోరా’ ఉంటుంది” అని బిందుమాధవి చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. “ఈ సినిమా అందరికీ కచ్చి తంగా నచ్చుతుంది” అని తెలిపారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని “దండోరా’కు స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్‌” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు నవదీప్, రవికృష్ణ, చిత్రబృందం పాల్గొన్నారు.