calender_icon.png 2 July, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంచందర్ రావుకు శుభాకాంక్షల వెల్లువ

01-07-2025 06:05:12 PM

కరీంనగర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా నియమితులైన రాంచందర్ రావు(Ramchander Rao)ను హైదరాబాదులో కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు నాయకులు వేరువేరుగా శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి, సునీల్ రావులు మాట్లాడుతూ... నమ్మిన సిద్ధాంతం, పార్టీ బలోపేతం కోసం నిరంతరం ఎనలేని కృషిచేసిన నాయకుడిగా రాంచందర్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సిద్ధాంతమే శ్వాసగా, బిజెపి యే ఊపిరిగా రాంచందర్ రావు రాజకీయ ప్రస్థానం కొనసాగిందని తెలిపారు.

విద్యార్థి దశనుండే సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని, ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా ఎగరవేసిన  నేతగా రాంచందర్ రావుకు గుర్తింపు ఉందని తెలిపారు. నాడు నక్సలైట్లు బెదిరించిన, పోలీసులు లాటిలు జులిపించిన బెదరని ధైర్య, సాహసాలతో ముందుకు కొనసాగిన చరిత్ర రాంచందర్ రావుకు ఉందన్నారు. న్యాయవాదిగా, ఆర్ఎస్ఎస్ వాదిగా, రాజకీయవాదిగా నిరంతరం పేద, బడుగు, వర్గాల న్యాయం కోసం నిత్యం పరితపించే రాంచందర్ రావు నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు కావడం సంతోషకరమన్నారు. రాంచందర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.