01-07-2025 05:54:24 PM
ఖమ్మం (విజయక్రాంతి): విద్యార్థులు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని స్కూల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని 14వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు(Corporator Kurakula Valaraju) అన్నారు. మంగళవారం వెలుగుమట్ల స్కూల్ లో నందకుమార్, వాసిరెడ్డి రామ్మోహన్ రావుల సహకారంతో ఆశాజ్యోతి ఫౌండేషన్(Asha Jyothi Foundation) ద్వారా 30000 విలువ గల నోట్ బుక్స్ స్కూల్ బ్యాగులు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం స్కూల్ హెచ్ఎం నిర్మల్ కుమారి అధ్యక్షతన జరగగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 14వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు హాజరై మాట్లాడుతూ... స్కూల్ కి ఎన్నో స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా పిల్లలకు ఎటువంటి లోటు రానివ్వకుండా ప్రైవేట్ స్కూళ్లకి దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి విద్య మూల కారణమని ఏ స్ఫూర్తితో అయితే వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో, పిల్లలు కూడా గురువులు చెప్పినటువంటి పాఠాలను శ్రద్ధతో విని క్రమశిక్షణతో మెలుగుతూ అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ యొక్క డివిజన్ కి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకోరావాలని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మంగమ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కొర్లపాటి ధనలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ జానీ మియా, నల్లగట్ల నర్సయ్య, ఫయాజ్, షేక్ దస్తగిరి, సయ్యద్ బాబా తదితరులు పాల్గొన్నారు.