calender_icon.png 2 January, 2026 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

02-01-2026 01:43:00 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సన్మానం

సనత్‌నగర్ జనవరి 1 (విజయక్రాంతి): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు బస్తీలు, కాలనీ వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు.

నూతన సంవత్సరం శుభాకాంక్షలుతో పాటు అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా నియమితులైన సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సనత్ నగర్ కార్పొ రేటర్ కొలన్ లక్ష్మీ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, నాయకులు తలసాని స్కైలా బ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, నాగులు, అశోక్ యాదవ్, ఆంజనేయులు, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, అం బులెన్స్ సురేష్, శేఖర్, మనోహర్ యాదవ్ తదితరులు ఉన్నారు.