02-01-2026 01:42:31 AM
హైదరాబాద్, జనవరి 1: మావోయిస్టు అగ్రనేత బర్సె దేవాతో సహా 15 మందిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సూక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన దేవా.. మావోయిస్టు దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో కలిసి పనిచేసినట్లు చెబుతున్నారు. బర్సె దేవాపై రూ.50లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. మరో వైపు మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలని పౌర హక్కుల సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టుల అరెస్ట్‌పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.