calender_icon.png 11 January, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ట్రా మోడ్రన్ మాల్.. ఓడియన్ మాల్

10-01-2026 01:54:35 AM

మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ముషీరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి):  షాపింగ్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెం ట్‌కు కేరాఫ్ అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్ అని, ఇది దేశంలోనే అల్ట్రా మోడ్రన్ మాల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో శుక్రవారం ఆయన ఓడియన్ మాల్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులకు సీఎం ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఓడియన్ మాల్ డైరెక్టర్ తూల్లా విజయేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ మాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నదని ఆకాంక్షించారు.

మాల్‌లో ఐనాక్స్ ఆధ్వర్యంలో మల్టీ ప్లెక్స్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దే శంలోనే ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ మాల్ ఇదేనని వెల్లడించారు. ఆపరేషనల్ ఎఫీషియెన్సీ, నావిగేషన్, స్మార్ట్ సిస్టమ్స్ అమలు లో మాల్ ముందుంటుందన్నారు. మాల్ ప్రమోటర్లు అమర్‌నాథ్, వుప్పలంచ మాట్లాడుతూ.. మాల్‌లో వినయోగదారులకు అ త్యుత్తమ షాపింగ్ అనుభవం కలుగుతుందన్నారు. వినియోగదారుల సంతృప్తే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రొటైల్, లైఫ్‌స్టుల్ రంగాలకు మాల్ సరికొత్త నిర్వచనం ఇవ్వబోతున్నదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఎండీ అజారుద్దీన్, ఎంపీ అనీల్‌కుమార్ యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మ హేందర్‌రెడ్డి, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య, పీవీఆర్ సినిమాస్ సీఈవో ప్రమో ద్ అరోరా, సైఫ్ అలీ ఖాన్, నజాఫ్ అలీ ఖాన్, ప్రమోటర్లు, డెవలపర్లు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువకుల ముందస్తు అరెస్ట్

ఓడియన్ మాల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యం లో నాంపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీసులు తెల్లవారుజామునే పలువురు నిరు ద్యోగ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 2 లక్షల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీని గుర్తుచేస్తూ గతంలో  అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ వారు ధర్నా చేస్తారనే అంచనాతోనే పోలీసు లు  పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం కార్యక్రమం తర్వాత వారందరినీ విడిచిపెట్టారు. తమ ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండించారు.