10-01-2026 12:00:00 AM
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, జనవరి 9 (విజయ క్రాంతి): విజయ క్రాంతి దినపత్రికలో విశ్లేషణాత్మక కథనాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం విజయ క్రాంతి 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ పాలసీలపై చైర్మన్ సిఎల్ రాజం రాస్తున్న వ్యాసాలు వివరంగా ఉంటున్నాయి అన్నారు.
పత్రికలో ప్రజా సమస్యలు ప్రతిబింబ చేస్తున్నారన్నారు. పత్రిక ప్రారంభించిన అనతి కాలంలోనే పాటక ఆదరణ పొందడం గొప్ప విషయం అన్నారు. మరింత పాఠక ఆదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, విజయ క్రాంతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం.హనుమంతరెడ్డి, రిపోర్టర్లు దేవేందర్ రెడ్డి (మేడ్చల్), భాస్కర్ (దమ్మాయిగూడ), బి ఆర్ ఎస్ నాయకులు ఆకిటి నవీన్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.