23-11-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
శుభకార్యాలు, పెళ్లిళ్లు, పేరంటం, వ్రతాలు జరిగినప్పుడు చీరె, సా రె పెట్టి ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయం. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరెల పేరుతో కోటి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరా గాంధీ జయంతి అయిన నవంబర్ 19 నుంచి ప్రారంభించింది. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరుతో నవంబర్ 19 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, మార్చి 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు చీరెలను పం పిణీ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
2017లో రాష్ర్టంలో ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించడానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవ త్సరం మహిళలకు బతకమ్మ చీరెల పేరు తో చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత కోటి మంది మహిళ లకు కోటి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ర్ట ప్రభుత్వం చీరెల పంపిణీ కార్యక్రమం మొ దలుపెట్టిందనే విమర్శలు వస్తున్నాయి.
మహిళా ఓట్లే లక్ష్యంగా..
గత కొంతకాలంగా పార్టీలు, ప్రభుత్వా లు ఏ ఎన్నిక జరిగినా గెలుపు మంత్రంగా మహిళా ఓట్లే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘లక్ పతి దీదీ’ పథకం నుంచి శాసనసభ ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో మహిళా ఓట్లే లక్ష్యంగా ప్రకటించిన పథకాలు గెలు పు మంత్రంగా మారిపోయినాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన అనేక రాష్ట్రాల్లో ప్రక టించిన మహిళా లక్షిత పథకాలు ఆయా పార్టీలకు ఓట్ల వర్షాన్ని కురిపించి అధికారంలోకి తెచ్చాయి.
కర్ణాటకలో ‘గృహల క్ష్మి’, తెలంగాణలో ‘మహాలక్ష్మి’, ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడ బిడ్డ నిధి’, బీహార్‌లో ‘మహిళా రోజ్‌గార్ అభియాన్’ లాంటి పథకాల కిం ద మహిళల ఖాతాలో ప్రతినెలా నగదు జ మ చేస్తామనే హామీతో ఆయా పార్టీలు.. ఆయా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి.
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు కోటి 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో పదివేల రూపాయలు నగదు జమ చేయడంతో పాటు మహిళా ఓట్లే లక్ష్యంగా అనేక హామీలు ఇవ్వడంతో ఒక్క జనతాదళ్ యునైటెడ్ పార్టీ గత ఎన్నికల కంటే రెట్టింపు సీట్లను సాధించడమే కాదు ఏకంగా నాలుగు శాతం తన ఓటు బ్యాంకుని పెంచుకోగలిగింది.
హామీలతో అధికారంలోకి..
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ మహిళలకు ఇచ్చిన హామీలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హా మీల వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి గ్యారెంటీ అతి ముఖ్యమైనది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతినెలా మహి ళలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి హామీని అమలు చేయడం లేదు.
తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతుంది. అలాగే ఆరు గ్యారంటీల్లో ప్రధాన హామీలైన మ హిళలకు ప్రతి నెలా 2,500 రూపాయలు, పెన్షన్ నాలుగు వేల రూపాయల పెంపు లాంటివి అమలు చేయకపోవడం వల్ల ఆ వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇందిరాగాంధీ స్ఫూర్తితో 2034 నాటికి రాష్ర్టంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళలను అదానీ, అంబానీలుగా తయారు చేస్తామ ని ప్రభుత్వం పదేపదే హామీలను గుప్పిస్తుంది.
మహిళలకు చీరెల పంపిణీ, జీరో వడ్డీకే రుణాలు లాంటి పథకాలకు కొత్త మెరుగులద్ది, మహిళలకు పెట్రోల్ బంకుల కేటాయింపు, ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, ఫ్రీ బస్, 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ లాంటి పథకాలు మహిళ లని ఎంత మేర కోటీశ్వరులను చేస్తా యి.
పండుటాకుల అసంతృప్తి!
ప్రభుత్వం హామీ ఇచ్చిన 2,500 రూ పాయల ఆర్థిక సహాయం నుండి తప్పించుకోటానికి ఏదో ఒక కొత్త పథకంతో మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం హడావుడి చేస్తుందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకి ఆర్థిక భరోసా కల్పించే మహాలక్ష్మి పథకంలోని కీలక హామీని అమలు చేయకుండా మహిళలను అదానీలని అంబానీలను ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పా టు కాగానే అమలు చేయాల్సిన పెన్షన్ పెంపు, మహిళలకి 2,500 రూపాయల పథకాల అమలు చేయకపోవడం వలన ప్రభుత్వం రాష్ర్టంలోని ఒక్కొక్క వృద్ధురాలికి 48 వేల రూపాయలు, ఒక్కొక్క మహి ళకి 60 వేల రూపాయలు బాకీ పడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత రెండు బడ్జెట్ లలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకి నిధులు కేటాయిస్తున్నా ఆ రెండు హామీల అమలుకి ఉద్దేశపూర్వకంగానే నిధులు కేటాయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
25 లక్షల మంది మహిళలకి ప్రతి నెలా 2500 రూపాయలు ఇవ్వాలంటే ఈ ఒక్క హామీకే బడ్జెట్ లో ప్రభుత్వం సంవత్సరానికి దరిదాపు 6000 కోట్ల రూపా యల నిధులను కేటాయించాలి. రాబోయే బడ్జెట్ లోనైనా ఈ రెండు హామీల అమలుకి ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ప్రభుత్వం తన విశ్వసనీయతను కోల్పోక తప్పదు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే పెన్షన్ 4 వేల రూపాయలకు పెంచింది. కానీ రాష్ర్ట ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉన్నా పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తామని చెప్పి హా మీని అమలు చేయకపోవడంతో పండుటాకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అవకాశవాద రాజకీయాలు..
మహిళలకు తులం బంగారం, స్కూటీ లు, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగక పోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ మాటలకే పరిమితం కావటం, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేరకపోవడంతో ప్రభుత్వం పై నిరుద్యోగులు, యువత అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపుతో స్థానిక సంస్థల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినా పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. కానీ బీసీలను నమ్మించి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందనే భావన కూడా వ్యక్తమవుతుంది. ఒక్క రైతు రుణమాఫీ చేసి ఒక దఫా రైతు భరోసాను ఎగవేయటం, బోనస్ సన్నాలకే పరిమితం చేయటం, 15 వేల రైతు భరోసా హామీ ఇచ్చి 12,000కే పరిమితం చేయటంతో రైతులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు.
కేసీఆర్ బంగారు తెలం గాణ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు తేడా ఏమీ లేదని రాష్ర్ట ప్రజలు, యు వత మరొకసారి మోసపోయారని ఒక నిరుద్యోగ విద్యార్థి బాధను వ్యక్తం చేశాడం కొన్ని వర్గాలకి ప్రభుత్వంపై ఇప్పటివరకు ఉన్న భ్రమలు మంచు తెరల్లాగా తొలగిపోతున్నట్లుగానే కనిపిస్తుంది. మహిళలను యువతను గెలుపు మంత్రాలుగా భావిం చి ఎన్నికల స మయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హా మీలను విస్మరించటం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా చూడాల్సిన అవస రముంది.
వ్యాసకర్త సెల్: 9912864973