23-11-2025 12:00:00 AM
శెగ్గారి వరుణ్ :
* ఫాతిమాకు ఆరేళ్ళ వయసు నుంచే హైపర్ యాక్టివిటీ, డిస్లెక్సియా లాంటి సమస్యలు ఉండేవి. సరిగ్గా మాట్లాడలేకపోవడంతో... తోటి పిల్లలు ఆమెను అవహేళన చేసేవారు. కానీ ఫాతిమాకు పట్టుదల ఎక్కువ. ఏ సమస్యా తన పురోగతిని ఆపకూడదని ఆమె చిన్నప్పుడే బలంగా సంకల్పించుకున్నారు.
మిస్ యూనివర్స్-2025 విజేతగా మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ కిరీటం దక్కించుకొని, టబాస్కో నుంచి గెలుపొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అయితే నిజానికి ఈ కిరీటం ఆమెకు అంత సులువుగా రాలేదు. పైగా ఆమె మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడానికి ముందే జీవితంలో ఎన్నో హేళనలు, అవమానాలు, ధిక్కారాలను దాటుకొని వచ్చింది. ఇక తాజాగా మిస్ యునివర్స్‌గా కీర్తి గడించిన ఫాతిమా బాష్ తలపైకి కిరీ టం చేరడానికి చాలా ఇబ్బందులు పడా ల్సి వచ్చింది.
ఎందుకంటే ఇదే మిస్ యూ నివర్స్ వేడుకల్లో ఆమెకు అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. మొత్తం ప్ర పంచ దేశ సుందరీమణుల అందరి ముం దు ఘోర అవమానానికి గురయ్యారు. మిస్ యూనివర్సిటీ పోటీలు నిర్వహించే సంస్థకు చెందిన అధికారి నవాత్ ఇత్సారగ్రిసిల్ అందరి ముందు హేళనగా మాట్లా డడం బాష్ అవమానకంగా ఫీలయ్యింది. వాస్తవానికి బాష్ చేసిన తప్పిదమేంటంటే అందాల పోటీలు జరుగుతున్న థాయిలాండ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోవడం, అలాగే తన జాతీ య అధికారి మాటలనే ఆదేశిస్తుందనేది నవాత్ ఆరోపణలు.
ఈ నేపథ్యంలోనే ఆ మెను దారుణంగా అవమానిస్తూ దుర్భాషలాడాడు. ఆఖరికి ఆమె పోటీ నుంచి నిష్క్రమించేలా పరిస్థితి తారాస్థాయికి చేరు కుంది. కానీ ఇదేం పద్ధతి అంటూ మిస్ యూనివర్స్ పోటీలపై సర్వత్రా విమర్శలు రావడంతో పోటీలు నిర్వహిస్తున్న సంస్థ కల్పించుకొని పరిస్థితి చక్కబెట్టింది. ఆ త ర్వాత జరిగిన ప్రతి పోటీలోనూ తనదైన శైలిగా న్యాయ నిర్ణేతలను, ప్రేక్షకులను మె ప్పించింది. ఆఖరి రౌండ్‌లోనే ప్రపంచ వే దికపై మహిళల హక్కులకు సంబంధించిన గొంతును వినిపించి మార్పు తీసుకు రా వాలని శక్తివంతంగా సమాధానమిచ్చి జడ్జీల మన్నలను పొంది విజేతగా నిలిచింది.
తల్లి కోరికను నెరవేర్చి..
ఇక ఫాతిమా బాల్యం అష్టకష్టాలతోనే నడిచింది. 2000 మే 19న మెక్సికోలోని టాబాస్కో రాష్ర్టం టిపియాలో జన్మించిన ఫాతిమా బాల్యం పోరాటాలతోనే సాగిం ది. ఫాతిమా తండ్రి బెర్నార్డో బాష్ హె ర్నాండెజ్ ఒ ప్రభుత్వ ఉద్యోగి. ఇంజినీర్ అయిన బెర్నార్డో 27 సంవత్సరాల పాటు పెట్రోలియోస్ మెక్సికనోస్ ప్రభుత్వ సంస్థ లో విధులు నిర్వర్తించారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన పెమెక్స్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ జనరల్ డైరెక్టర్‌కు సలహాదారుగా కొనసాగుతున్నారు.
కాగా ఫాతి మా బాష్ తల్లి వెనెస్సా ఫెర్నాండేజ్ బా ల్బోవా. వెనెస్సా కూడా మోడలింగ్ రం గంలో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఏనాడు పోటీల్లో పాల్గొనలేదు. తన మనసులోని కోరికలను తన ముగ్గురు కూతుళ్లలో చూసుకోవాలని వెనెస్సా ఆరాటపడింది. అందుకు తగ్గట్లే ఆమె మొదటి ఇద్దరు కూతుళ్లు గతంలో ఫ్లోర్ టబాస్కో కిరీటాన్ని సాధించగా.. 2018లో ఫాతిమా టబాస్కో కిరీటాన్ని గెలిచి తల్లికి మొదటి విజయాన్ని అందించింది. తాజాగా మిస్ యూనివర్స్‌గా నిలిచి తల్లి ఆశయాన్ని నెరవేర్చిన గొప్ప కూతురుగా ఆమె ముందు సగర్వంగా నిలబడగలిగింది.
మానసిక సమస్యలు..
ఫాతిమాకు ఆరేళ్ళ వయసు నుంచే హైపర్ యాక్టివిటీ, డిస్లెక్సియా లాంటి స మస్యలు ఉండేవి. సరిగ్గా మాట్లాడలేకపోవడంతో... తోటి పిల్లలు ఆమెను అవహే ళన చేసేవారు. కానీ ఫాతిమాకు పట్టుదల ఎక్కువ. ఏ సమస్యా తన పురోగతిని ఆపకూడదని ఆమె బలంగా సంకల్పించుకు న్నారు. మానసిక దారుఢ్యాన్ని పెంచుకున్నారు. చదువులో, ఆటపాటల్లో ముం దుండేవారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమం కింద... అమెరికాలోని లైన్డన్ ఇనిస్టి ట్యూట్‌లో హైస్కూల్ విద్య అభ్యసించారు.
అక్కడే ఆమె ఆంగ్లం బాగా నేర్చుకున్నారు. ఆ తరువాత ఫాతిమా దృష్టి సృజనాత్మకతవైపు మళ్ళింది. మెక్సికోలోనే ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైన్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత ఇటలీలోని మిలన్‌లో ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఎబిఎలో మాస్టర్స్ పూర్తి చేశా రు. అందాల పోటీల్లో ఆమె విజయా లు... 2018లో ‘ఫ్లోర్ టబాస్కో’ టైటిల్ గెలుచుకోవడంతో మొదలయ్యాయి. దాన్ని సా ధించడం తన చిన్ననాటి కల అని ఒక సం దర్భంలో ఆమె చెప్పారు.
ఆ తరువాత జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా... చదువుకే ప్రాధాన్యం ఇచ్చారు. మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘మిస్ యూనివర్స్-మెక్సికో’గా నిలిచారు. ఇప్పు డు ‘మిస్ యూనివర్స్’గా గెలిచారు. టొబాస్కోకు చెందిన ఒక మహిళ ఈ ఘనతను సాధించడం అదే మొదటిసారి.
గెలుపుతోనే సమాధానం..
ఇష్టంగా నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఫాతిమా వృత్తిగా చేసుకున్నారు. తను రూపొందించినవన్నీ పర్యావరణానికి అ నుకూలంగా ఉండాలని ఆమె ఆశిస్తారు. సామాజిక సేవ పట్ల కూడా మక్కువ ఎక్కు వే. తమ ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సా యపడడం కోసం పదేళ్ళుగా ఆమె పాటుపడుతున్నారు. టోబాస్కోలోని ఆంకాలజీ ఆసుపత్రిలో ... వార్షిక సెలవుల్లో పిల్లలకో సం కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహిస్తూ ఉంటారు.
ఫాతిమాకు జంతువు లంటే ఇష్టం. గుర్రపుస్వారీ, పుస్తక పఠనం, చిత్రలేఖనం, టెన్నిస్... ఇలా అనేక అభిరుచులు ఉన్నాయి. ఆమె ప్రేమగా పెంచుకు న్న కుక్కపిల్ల ఈ పోటీలకు కొద్దిరోజుల ముందే మరణించింది. దానికి నివాళిగా... పోటీ సమయంలో తన దుస్తులకు ఒక చి న్న పిన్నును ఫాతిమా ధరించారు. “ఆడపిల్లలు తమ కలలను సాకారం చేసుకోవడ మే ధ్యేయంగా పాటుపడాలి. తమ సామ ర్థ్యం, విలువ పట్ల ఎప్పుడూ నమ్మకంతో ఉండాలి” అంటారామె.
పోటీల్లో న్యాయవిజేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... మహిళల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తానని చెప్పిన ఈ నవ విశ్వసుందరి... ఇప్పటికే అదే దారిలో పయనిస్తున్నారు. అయితే చిన్నప్పుడు మాటల్లో స్పష్టత లేక తడబడిన ఆ చిన్నారే.. తన మానసిక సమస్యలనే బలంగా మార్చుకొని విజేతగా నిలి చింది. మహిళా హక్కులపై తన గొంతును విప్పి.. ఒక్క గెలుపుతో నోరు మూయించింది. అవమానాలు, చీత్కారాలు గెలు పుకు ఆటంకాలు కాదు బలం అని చాటి చెప్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
వ్యాసకర్త సెల్: 9912864973