02-05-2025 01:01:39 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్
పాత నాయకులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం
రాజేంద్రనగర్, మే1: కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస జరిగింది. గురువారం శంషాబాద్ లోని ఓ కన్వె న్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అదేవిధంగా సి డబ్ల్యూ సి సభ్యుడు వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చ రించారు. దీంతో సమావేశంలో రసాభాస నెలకొంది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే పాత నాయకులను పట్టించుకోవడంలేదని వారికి సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు పాతవారిని అణగదొక్కుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్టేజీపై ఉన్న ఫ్లెక్సీలో మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మె ల్యే అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫోటో పెట్టలేదని ఆయన అభిమానులు, మహేశ్వరం నాయకులు నిరసనకు దిగారు. దీంతో స్పోర ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వారిపై మండిపడ్డారు. ఆందోళన విరమించకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
- స్థానిక సంస్థల్లో గెలుపు మాదే
త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించ డం ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే పాత నేతలకు ప్రాధాన్యం ఇస్తామని వారికి 75% పదవులు కట్టబెడతామని వారికి హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్ గా రు సన్న బియ్యం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహేశ్వరం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు కేఎల్‌ఆర్, భీమ్ భరత్ తదితరులు హాజరయ్యారు.