02-05-2025 01:04:28 AM
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, మే 1: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొండపాక, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి మంత్రిని గజ్వేల్ నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించారు. స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు ఈనెల 10వ తేదీలోపు గజ్వేల్ పర్యటనకు రానున్నట్లు తెలిపారు.
ఈ సంద ర్భంగా ఆయా మార్కెట్ కమిటీల సన్మాన కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త లు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించగా, నాయకులు సాజి ద్ బేగ్, రాజేశ్వర్ గుప్త, సురేష్ తదితరులు పాల్గొన్నారు.