calender_icon.png 21 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిల్ అంబానీ ఆస్తులు ఈడీ జప్తు

21-11-2025 12:00:00 AM

-రూ.1,452 కోట్లు అటాచ్

-నవీ, ముంబై, చెన్నై, పూణే, భువనేశ్వర్ ప్రాంతాల్లోనివి..

 న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిల యన్స్ గూప్‌నకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, తాజాగా రూ.1,452 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్‌గా అటాచ్ చేసినట్లు గురు వారం సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణే, భువనేశ్వర్‌లలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ ఆస్తులను జప్తు చేశామన్నారు. కాగా అనిల్ అంబానీ నేతృత్వం లోని కంపెనీలలో ఆర్థిక అవకతవకలపై ఈడీ కొంతకాలంగా విచారణ జరుపుతోం ది. ఈ దర్యాప్తులో భాగంగానే అధికారు లు తాజాచర్యలు తీసుకున్నారు. ఈనెల ప్రా రంభంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లకు సంబంధించిన బ్యాం కు మోసం కేసులపై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి, పీఎంఎల్‌ఏ కింద నవీ ముం బైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్‌సిటీలో రూ.4,462. 81 కోట్ల విలువైన 132 ఎకరాల భూమిని ఏజెన్సీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జప్తు చేసింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ నుంచి ఈ మనీలాండరింగ్ దర్యా ప్తు జరిగింది. ఇందులో ఆర్‌సీఓఎం, అనిల్ అంబానీ, ఇతరుల పేర్లు ఉన్నాయి. ఈడీ ప్రకారం, ఆర్‌సీఓఎం, దాని గ్రూప్ కంపెనీలు 2010 మధ్య దేశీయ, విదేశీ రుణదాతల నుంచి రుణాలు పొందాయి. మొత్తం బకాయిలు రూ.40,185 కోట్లు. ‘అప్పటి నుంచి ౫బ్యాంకులు గ్రూప్‌ఖా తాలను మోసపూరితమైనవిగా ప్రకటించాయి.