13-05-2025 12:00:00 AM
ఘనంగా నిర్వహించిన హాస్పిటల్స్ యాజమాన్యం
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ సోమవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే ను ఘనంగా నిర్వహించారు. తమ నర్సింగ్ సిబ్బంది సేవలకు కృతజ్ఞతగా వారం రోజులపాటు అన్ని కేర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్ నేతృత్వంలో హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్‌లో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి, గ్రూప్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ మాథుర్, చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్, వెస్ట్, సెంట్రల్ ఇండియా రీజినల్ సీఈఓ హరీష్ త్రివేది, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినోద్ రామణ్‌తో పాటు, వివిధ ఆసుపత్రుల హెడ్లు, డాక్టర్లు పాల్గొన్నారు. ‘మా నర్సులు, మా భవిష్యత్తు, కేర్ యొక్క ఆర్థిక శక్తి’ అని పేర్కొంటూ వేడుకలు నిర్వహించారు.
విశాల్ మహేశ్వరి మాట్లాడుతూ.. నర్సులు ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కేర్ హాస్పిటల్స్ వారు నర్సింగ్ బృందం అభివృద్ధికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందని చెప్పారు. డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. నర్సులు ఆరోగ్య వ్యవస్థకు బలమైన స్థంభాలు అని చెప్పారు.
డాక్టర్ అమిత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నర్సుల అవసరం పెరుగుతోందని, ఆసుపత్రుల పని తీరుపై పూర్తి అవగాహన ఉన్న నర్సులు నాయకత్వ పాత్రలు తీసుకోవాలి అని తెలిపారు. డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ నర్సెస్ డే ప్రతి నర్సు చేసే గొప్ప సేవలకు గుర్తింపు ఇచ్చే రోజు అన్నారు.