02-12-2025 12:45:55 AM
-‘రాజీ’కి ముమ్మరంగా బేరసారాలు?
- వేడెక్కుతున్న సర్పంచు ఎన్నికలు
మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ‘అన్నా పోటీ నుంచి తప్పుకోరాదే.. నువ్వు తప్పుకుంటే నా గెలుపు సునాయా సం అవుతుంది’ అని పలుచోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ప్రత్యర్థులను ‘రాజీ’ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల నేతలు జోక్యం చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రత్యర్థులను రాజీ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎన్ని కల బరిలో నిలిచిన ప్రత్యర్థులను రాజీ చేసుకోవడానికి ప్రత్యర్థులు ప్రయత్నాలు ముమ్మ రంగా నిర్వహిస్తున్నారు. పార్టీపరమైన ఎన్నికలు కానప్పటికీ అధికార కాంగ్రెస్, ప్రతి పక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు ఎవరికి బ లం ఉన్నచోట వారు పోటీకి దిగిన ఇతరులను ఉపసంహరించుకునే విధంగా రాజీ ప్ర యత్నాలు జోరుగా సాగిస్తున్నారు.
చాలాచోట్ల వార్డు సభ్యులకు పెద్దగా పోటీ లేనప్ప టికీ, సర్పంచులకు మాత్రం బహుముఖ పో రు తప్పించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. బలం ఎక్కువగా ఉన్నచోట సర్పం చు పదవులను తాము తీసుకొని, ఇతర పార్టీలకు ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవు లను ఇవ్వడానికి, లేదంటే ‘నయానో బయా నో’ ఒప్పించేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈసారి తమకు వదిలేస్తే వచ్చే ఎంపీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో మీకు మద్దతిస్తామంటూ ప్రతిపాదనలు తెస్తూ రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవం కోసం చాలాచోట్ల ప్ర యత్నాలు చేస్తూ ఎన్నికల ‘ఖర్చు’ తప్పించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.