10-01-2026 08:26:40 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్-5 ఆధ్వర్యంలో పేదలు, నిరుపేదల సంక్షేమార్థం “క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ నీడ్ ఫుల్ లైవ్స్ అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ బి. సంతోష్ కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 05 నుండి 08 వరకు దుస్తుల సేకరణ చేపట్టి బాచారం, మజర్‌గూడలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ వద్ద అవసరమైన వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన దుస్తులు అందించి వారికి సహాయపడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవాభావంతో పాల్గొని సమాజ సేవలో తమ బాధ్యతను చాటుకున్నారు. ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం జాతీయ సేవా పథకం యొక్క మౌలిక సూత్రాలైన సేవ, సమర్పణ, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తాయని, భవిష్యత్తులో కూడా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.