26-01-2026 01:08:39 AM
వనదేవతల సాక్షాత్కారం
సమ్మక్క సారలమ్మ దైవదర్శనం
భక్తుల జనసందోహం
పుడమితల్లి ఆనంద విహారం
గుడీగోపురం లేని
అర్చనాఅభిషేకాలు లేని
మడి ధూపం లేని
పసుపు కుంకుమభరిణ తేజం
తలనీలాలు మునకలు
జంపన్నవాగు తలస్నానాలు
నిలువెత్తు బంగారు బెల్లాలు
జమిడిక డప్పు మోతలు
సిగుమూగు డోలిరాగాలు
ఆదివాసీ సంబురాలు
ఆనంత కోటి శక్తిప్రసాదాలు
గిరిజన మేడారం జాతరలు
ఎందరో త్యాగాల వనమాలికం
పడిగిరాజు గోవిందరాజుల
గద్దెల తలమానికం
పశువశాన పవిత్ర ధామం
ఆసియాలోనే అతిపెద్ద జాతరై
తెలంగాణ పండుగగా వాసికెక్కి
మండ మిలిగే పండుగతో మొదలై
కాక, సిద్ధ వంశం
సంప్రదాయల మధ్య
చెలపెయ్య బలులూ
కోయ వాద్యాలతో
శివ సత్తుల కోలాహలంతో
సమ్మక్క - సారలమ్మ ఆగమనంతో
మేడారం భక్తి భావంగా కీర్తింపబడెను !
(ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర సందర్భంగా)
డా.పగిడిపల్లి సురేందర్