calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘంటసాల బయోపిక్ సిద్ధం

04-12-2025 01:59:19 AM

తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకుల్లో ఒకడైన సంగీత దర్శకుడు ఘంటసాల. ఆయన బయోపిక్ రూపొందించారు దర్శకుడు సీహెచ్ రామా రావు. ఘంటసాల జీవితంలోని విశేషాలతో రూపొందుతున్న ఈ సినిమా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే టైటిల్‌తో రానుంది. ఈ చిత్రంలో ఘంటసాలగా కృష్ణచైతన్య, ఆయన సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా తులసి చిత్రం ఫేమ్ అతులిత నటించగా సుమన్ ముఖ్యపాత్రను పోషించారు.

సుబ్బరాయశర్మ, జేకే భారవి, సుమన్‌శెట్టి, అనంత్, సాయికిరణ్, అశోక్‌కుమార్, గుండు సుదర్శన్, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్‌పై సీహెచ్ ఫణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసు రావు; కెమెరా: వేణు మురళీధర్.