25-07-2025 02:01:52 AM
ఇప్పటి వరకు 11 మంది మృతి
కూకట్‌పల్లి, జూలై 24: కల్తీ కల్లు తాగి చికి త్స పొందుతు న్న మరో వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆల్విన్ కాలనీ హింద్రహిల్స్‌లో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్ (35) బైక్‌పై రాపిడో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిచరణ్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లో ఈ నెల 6న కల్లు తాగాడు.
ఇంటికి వచ్చిన తర్వాత విరోచనాలు, వాంతులు కావడంతో కు టుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప రిశీలించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి త రలించాలని సూచించారు. అక్కడ చికి త్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.