01-10-2025 12:11:41 AM
అమ్మవారికి సమర్పించిన కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
అలంపూర్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్ర ఆలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా ఏపీ సర్కార్ తరఫున అధికారకంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి జోగుళాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు.పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయానికి వచ్చిన కలెక్టర్ సిరికి ఆలయ ఈవో దీప్తి ,అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ముందుగా కలెక్టర్ బాల బ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలను అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం సంతోషదాయకంగా ఉందని అమ్మవారి ఆశీస్సులు ఇరు రాష్ట్రాల ప్రజల పైన ఉండాలని కలెక్టర్ సిరి తెలిపారు.