31-12-2024 12:00:00 AM
భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాలి. ప్రేమనే కాదు.. కోపాలను, బాధలను పంచుకోవాల్సి ఉంటుంది. పవిత్రమైన బంధంలో అప్పుడప్పుడు కొన్ని అలకలు సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు భార్య అలక ఎంతైనా తీరదు. భార్య కోపంగా ఉంటే ఆమెను స్పర్శించాలి.
ఒక చిన్న స్పర్శ భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించగలదు. కౌగిలించుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వంటివి చేయడం వల్ల ఎడబాటు దూరమై దగ్గరవుతారు. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పు డు ఇంకో వ్యక్తి తగ్గి మాట్లాడాలి. భార్య కోపంగా ఉన్నా, అలిగినా భర్త కొంత తగ్గి మాట్లాడాలి. ఆమె కోపాన్ని తగ్గించేందుకు ఆమె ఏం చెప్పినా ఒకే అంటే సరిపోతుంది. భర్తల తప్పు లేకపోయినా కొన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి.